అవినీతి ఆరోపణలపై బంగ్లాదేశ్ తొలి ప్రధాన న్యాయమూర్తికి శిక్ష విధించింది బంగ్లాదేశ్ న్యాయస్థానం. మనీలాండరింగ్, నమ్మక ద్రోహం కేసులో బంగ్లాదేశ్ కోర్టు మైనారిటీ హిందూ సమాజానికి చెందిన దేశంలోని మొదటి ప్రధాన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ సిన్హాకు మంగళవారం 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సరేంద్ర కుమార్ సిన్హాకు మనీలాండరింగ్ కేసులో ఏడేళ్లు, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే… బంగ్లాదేశ్ పద్మా బ్యాంకు నుంచి తీసుకున్న 4 కోట్ల టాకాలు (4,70,000 యూఎస్ డాలర్లు) అప్పుగా తీసుకుని మనీలాండరింగ్ పాల్పడ్డాడని నిరూపితం అయింది.