కొడాలి నాని….నీ తండ్రి ఆత్మ వచ్చి..నీకు వార్నింగ్ ఇస్తుంది : వర్ల రామయ్య

చంద్రబాబుని టీడీపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు కలిశారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి ఈ సందర్భంగా నివేదిక అందచేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు, కొడాలి నాని ఆయన తండ్రి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. వర్ల రామయ్యతో ఎందుకు పెట్టుకున్నావ్ అని కొడాలినాని తండ్రి ఆత్మ ఖచ్చితంగా హెచ్చరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

varlaramaiah questions ys jagan on viveka murder case

గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను గవర్నరుకి అంద చేస్తామని.. గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారని.. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ టాక్స్ శాఖలు సమగ్ర దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. కొడాలి నానికి బేడీలు తప్పవని హెచ్చరించారు వర్ల రామయ్య.