హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..లోన్ ఈఎంఐ మరింత భారం..!!

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ను 0.20 శాతం పెంచింది..మే తర్వాత బ్యాంకు రుణంపై వడ్డీని పెంచడం ఇది మూడోసారి. మే నుంచి HDFC మొత్తం వడ్డీ రేటు 0.80 శాతం పెరిగింది. దీనివల్ల రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా పెరగనున్నాయి. HDFC బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి MCLR ఇప్పుడు 8.05 శాతంగా ఉంది. ఇది గతంలో 7.85 శాతంగా ఉంది..

హెచ్డిఎఫ్సి ఆన్ లైన్ సమాచారం ప్రకారం..ఒక రోజు MCLR వడ్డీ ఇప్పుడు 7.50 శాతం నుంచి 7.70 శాతంగా ఉంది. అదే సమయంలో మూడేళ్ల ఎంసీఎల్ఆర్పై వడ్డీ 8.25 శాతంగా ఉంది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే కస్టమర్లకి ఈఎంఐ మరింత భారం కానుంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మే-జూన్లో రెండు దశల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన పాలసీ రేటు రెపోను 0.90 శాతం పెంచింది..అప్పటి నుంచి బ్యాంక్ లోన్స్ పై మరింత వడ్డీని పెంచుతున్నాయి.

ఇది ఇలా ఉండగా..ఓవర్నైట్ రుణాలపై వడ్డీరేటు 7.50 నుంచి 7.70 శాతానికి పెరుగుతుంది. నెల రోజుల టెన్యూర్ గల రుణంపై వడ్డీరేటు 7.75, మూడు నెలల గడువు గల రుణంపై వడ్డీరేటు 7.80, ఆరు నెలల టెన్యూర్ గల రుణంపై 7.90 శాతం వడ్డీరేటు విధించనుంది. ఏడాది టెన్యూర్ రుణాలపై వడ్డీ 8.05, రెండేండ్ల గడువు రుణంపై 8.15, 3 ఇయర్స్ గల 8.25 శాతం వడ్డీరేటు వసూలు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news