స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డుతో ఉచితంగా రూ.2 లక్షలు బెనిఫిట్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. డెబిట్ కార్డు సేవలు, సేవింగ్స్ అకౌంట్ కూడా వాటిలో భాగమే. ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ ప్రత్యేకంగా జన్ ధన్ అకౌంట్ సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. ఇక దాని గురించి మరియు ఆ డెబిట్ కార్డు వలన కలిగే లాభాల గురించి చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

SBI
SBI

జన్ ధన్ ఖాతాని స్టేట్ బ్యాంక్ లో ఫ్రీగా ఓపెన్ చెయ్యచ్చు. ఒకవేళ ఓపెన్ చెయ్యాలంటే కచ్చితంగా మీకు మరే ఇతర బ్యాంకుల్లో కూడా సేవింగ్స్ అకౌంట్ ఉండకూడదు. ఈ స్టేట్ బ్యాంక్ జన్ ధన్ ఖాతా కలిగిన వారికి పలు రకాల బెనిఫిట్స్ లభిస్తున్నాయి. వీటిల్లో ఓవర్ డ్రాఫ్ట్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ జన్ ధన్ అకౌంట్ ఉంటే రూపే డెబిట్ కార్డు కూడా అందిస్తారు. రూపే డెబిట్ కార్డు కలిగిన వారికి ఉచితంగానే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. ఈ బెనిఫిట్ ని పొందాలి అంటే డెబిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందడానికి అవుతుంది. కేవలం ఈ అకౌంట్ ని ఎస్‌బీఐలోనే ఓపెన్ చెయ్యాలనేమి లేదు ఇతర బ్యాంకుల్లో జన్ ఖాతా ఓపెన్ చేసినా కూడా ఈ ప్రయోజనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్ ధన్ యోజన స్కీమ్‌‌ను తీసుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news