రూపాయి విలువ పతనంపై కేటీఆర్ ట్వీట్

-

రూపాయి విలువ పతనంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి(₹81.18)కి పడిపోవడంపై స్పందించారు. ట్విటర్‌ వేదికగా కేంద్రం తీరుపై కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అయినా కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌’ కారణమని చెప్పారు. విశ్వగురువును పొగడండి’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.

మరోవైపు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం రూపాయి విలువ మరింత దిగజారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాలరుతో పోల్చితే 44 పైసలు తగ్గి.. 81.09కు క్షీణించింది. గురువారం రూపాయి విలువ ఏకంగా 83 పైసలు పతనమై.. డాలరుతో పోల్చితే 80.79కి చేరింది. ఫిబ్రవరి 24 తర్వాత రూపాయి ఒక్కరోజులో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news