ఇలా నిమిషాల్లోనే పర్సనల్ లోన్..!

స్టేట్ బ్యాంక్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దీని వలన కస్టమర్స్ కి ఎన్నో రకాల లాభాలు వస్తాయి. అయితే కస్టమర్లకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే కేవలం నిమిషాల్లోనే లోన్లు ఇస్తోంది. ఈ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ కోసం యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అలానే పీఏపీఎల్‌‌‌‌‌‌‌‌తో పాటు లోన్లపై మరో ఆఫర్‌‌‌‌‌‌‌‌ను కూడా ఇది ఇస్తోంది. అయితే వచ్చే ఏడాది జనవరి 31 వరకు లోన్ తీసుకునేవాళ్లకు ప్రాసెసింగ్ ఛార్జీలు పడవు.

కొత్త సేవని స్టేట్ బ్యాంక్ ప్రారంభించింది. అదే ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్. ఈ ఒక్క యాప్ ద్వారా స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. లోన్ తక్షణమే పంపిణీ చేయబడుతుంది. కస్టమర్‌లకు 31 జనవరి 2022 వరకు ప్రాసెసింగ్ ఫీజులో పూర్తి మినహాయింపు పొందొచ్చు. పటిష్టమైన క్రెడిట్ చరిత్ర , మంచి రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న కస్టమర్లకు మాత్రమే ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లు ఇస్తారు.

మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి PAPL అని వ్రాసి 567676కి సందేశం పంపవచ్చు. లోన్ కేవలం 4 క్లిక్‌లలో ప్రాసెస్ చేయబడుతుంది , లోన్ డబ్బు తక్షణమే ఖాతాకు బదిలీ చేయబడుతుంది. యోనో యాప్ ద్వారా 7 రోజుల పాటు రుణాన్ని పొందవచ్చు. రుణ వడ్డీ రేటు 9.60 శాతం నుండి ప్రారంభమవుతుంది.

ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే.. మీ మొబైల్ ఫోన్‌‌‌‌లో యోనో యాప్‌‌‌‌ని ఓపెన్‌‌‌‌ చేసి, లాగిన్‌‌‌‌ కోసం ఎంపిన్ లేదా పాస్‌‌‌‌వర్డ్ ఉపయోగించాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెను నుండి, ‘గెట్ నౌ’ ఆప్షన్‌‌‌‌ ఎంచుకోండి. లోన్ కట్టాల్సిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌‌‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌‌‌‌ చేయండి. కాసేపటికి లోన్ క్రెడిట్ అవుతుంది.