దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ ఎప్పుడు కూడా వివిధ రకాల ఆఫర్స్ ని తీసుకు వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా కస్టమర్స్ షాపింగ్ కోసం లోన్ ఆఫర్ ని తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
షాపింగ్ కోసం డబ్బులు కావాలనుకునేవారికి క్షణాల్లో లోన్ ఇచ్చే ఆఫర్ ఒకటి ఉంది. దీనితో కస్టమర్స్ రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ని పొందొచ్చు. అలానే ఈఎంఐ ఫెసిలిటీ కోసం ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఎలాగూ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. ఒకవేళ క్రెడిట్ కార్డు లేదు అంటే డెబిట్ కార్డ్ ఉన్నవారు ఆ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు అని ఎస్బీఐ అంది.
ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటే చాలు. షాపింగ్ చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. అయితే రూ.8,000 నుంచి రూ.1,00,000 దాకా షాపింగ్ చేసుకోవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ పద్ధతి ద్వారా ఈ లోన్ వస్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునే కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ అయితే ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో అయితే ఆఫ్ లైన్ లో ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా పొందవచ్చు. ఎంత లోన్ వస్తుందో చూడాలంటె ఎస్‌బీఐ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి మీరు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.
DCEMI అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే లిమిట్ గురించి తెలుస్తుంది. షాపింగ్ చేసి బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు ఎంత మొత్తం వాడుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించాలనుకుంటున్నారో ఎంచుకోండి. 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలల ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోచ్చు. మొత్తానికి 14.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.