కొత్తగా లోన్ తీసుకోనేవారికి SBI గుడ్ న్యూస్..!

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కొత్త పథకాలను, కొత్త ఆఫర్లను అందిస్తూ వస్తుంది.ఇందులో పెట్టుబడి పెడితే మంచి వడ్డీతో పాటు,సేఫ్ కూడా ఉంటుంది. అందుకే ఎస్బీఐ లో రోజు రోజుకు ఖాతాదారులు పెరిగి పోతున్నారు.కాగా, ఎస్బీఐ ఇప్పుడు కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ తీసుకునే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపు కల్పించింది. 50 నుంచి 100 శాతం వరకు మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల చివరి వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు..

 

ఇకపోతే హోమ్ లోన్, హోమ్ రిలేటెడ్ లోన్స్ సాదారణ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే హోమ్ లోన్ టేకోవర్, టాప్ అప్ సంబంధిత రుణాలకు అయితే బేసిక్ ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే అడ్వాకోట్ అండ్ వాల్యూయర్ ఫీజు- యాక్చువల్ ఎక్స్పెన్సెస్ వంటి వాటిలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా లాగిన్ ఫీజు, టెక్నికల్ అసెస్మెంట్ ఫీజు, లీగల్ ఫీజు, ఫ్రాకింగ్ ఫీజు, ప్రీ ఈఎంఐ చార్జ్, రెగ్యులేటరీ చార్జీలు, రీఅప్రైజల్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం, నోటరీ ఫీజు, అడ్జుడికేషన్ ఫీజులు కూడా ఉంటాయని స్పష్టం చేసింది..

ప్రస్తుతం ఎస్బీఐ లో ఉన్న హోమ్ లోన్ల వివరాలు..

ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేటు:

2022 జూన్ 15 నుంచి బ్యాంక్ ఈబీఎల్ఆర్ రేటను గమనిస్తే.. 7.55 శాతం, సీఆర్పీగా ఉంది. ఆర్ఎల్ఎల్ఆర్ రేటును పరిసీలిస్తె.. 7.15 శాతం, సీఆర్పీగా ఉంది. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన రిస్క్ ప్రీమియంను వసూలు చేస్తుంటారు.

ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు:

స్టేట్ బ్యాంక్ జూలై 15 నుంచి ఎంసీఎల్ఆర్ రేటును పెంచిన విషయం తెలిసిందే. ఎంసీఎల్ఆర్ రేటు 0.1 శాతం మేర పైకి చేరింది. ఇప్పుడు ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 7.5 శాతంగా ఉంది. రుణాలకు ప్రామాణికంగా తీసుకునే ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు.అయితే, ఎస్బీఐ లో రానున్న రోజుల్లో రుణ రేట్లను మరింత పెంచే అవకాశం ఉంది..ఇటీవల ఫిక్స్ డ్ డిపాజిట్స్ పై వడ్డీలను పెంచిన విషయం తెలిసిందే..