డబ్బులని బ్యాంక్ లో పెట్టాలనుకుంటున్నారా..? HDFC, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ లో ఏది బెస్ట్ అంటే..?

మీ దగ్గర వున్న డబ్బులని బ్యాంక్ లో పెట్టాలని అనుకుంటున్నారా..? వాటిని చక్కగా ఫిక్సెడ్ డిపాజిట్ చేసి మంచిగా వడ్డీని పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఇది తెలుసుకోవాలి. మీరు మీ డబ్బులని బ్యాంక్ లో పెట్టె ముందు వీటిని గమనించండి. అన్ని బ్యాంకుల్లో వడ్డీ ఒకేలా ఉండదు.

money
money

కనుక ఎక్కువ వడ్డీ ఏ బ్యాంకులో వస్తుందో అక్కడే మీరు మీ యొక్క డబ్బుని పెట్టండి. అలా చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏఏ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ముందుగా గమనించాలి. పూర్తి వివరాల లోకి వెళితే…

దేశీ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్ ఏడాది ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీని ఇస్తోంది. ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 6.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే విధంగా డీసీబీ బ్యాంక్ కూడా 5.3 శాతం నుంచి 5.9 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇక యాక్సెస్ బ్యాంక్ అయితే 5.1 శాతం వడ్డీ ఇస్తోంది. మాక్సిమం 5.75 శాతం వరకు వడ్డీని పొందొచ్చు.

ఆర్‌బీఎల్ బ్యాంక్ నుండి 6 శాతం నుంచి 6.3 శాతం వరకు వస్తుంది. అదే దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయితే 5 శాతం నుంచి వడ్డీని అందిస్తోంది. గరిష్టంగా 5.4 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ 4.9 శాతం నుంచి 5.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో అయితే 4.9 శాతం నుంచి 5.4 శాతం వస్తుంది.