బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులు నేరుగా సీఎం కేసీఆర్ గాని, మంత్రి కేటీఆర్ గాని వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ మధ్య మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం, విద్యార్థుల సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించకపోవడంతో విద్యార్థులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
తమకు ఇంచార్జీ వీసి వెంకట రమణ ఇచ్చిన సమయం వరకు వేచి చూస్తామని,తరువాత ఉదయం నుంచి ఉద్యమం చేస్తామని తెలిపారు.ఫుడ్ పాయిజన్ కు కారణం అయిన మెస్ ల పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు.ఇచ్చిన గడువు లోపు మిగతా డిమాండ్ లు నెరవేర్చలేకనే మా పేరెంట్స్ తో వీసి సమావేశం నిర్వహిస్తున్నారనీ అన్నారు.పేరెంట్స్ ను సైతం సమావేశం కు పిలిచి సెల్ ఫోన్లు తీసుకున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.E 3 వాళ్లకు సెలవులు ఇచ్చారని..మేము ఎవ్వరం బయటకు వెళ్లడం లేదని, తమ పోరాటాన్ని మళ్లీ కొనసాగిస్తామని తెలిపారు.