యమునాలో స్నానం.. ఆసుపత్రి పాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్..!

-

ఢిల్లీలో గత కొద్ది రోజుల నుంచి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యమునా నదిలో విషపూరితమైన నురగ కాలుష్యానికి కారకంగా తెలుస్తోంది. విషపూరితమైన నురగ ఎలాంటి కాలుష్యం ఉందో.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా చేసినటువంటి ప్రయత్నం.. ఆయనను ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. యమునా నదిలో స్నానం చేసిన రోజు తరువాత ఆయన స్కిల్ అలర్జీకి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

చర్మం పై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాడు. దేశ రాజధానిలోని యమునా నదిలో సచ్ దేవా స్నానం చేసారు. 2025 నాటికి యమునాని శుభ్రం చేస్తానని గతంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం హామి ఇచ్చింది. దానిని నేర్చలేదని ఆరోపిస్తూ.. సచ్ దేవా యమునాలోని కాలుష్యాన్ని తెలిపేందుకు అందులో స్నానం చేసి ఆసుపత్రి పాలయ్యారు. యమునా నది శుద్ధికి ఉద్దేశించిన నిధులను ఆప్ ప్రభుత్వం కాజేసిందని.. కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు 2025 ఛత్ పూజకు ముందు దానిని శుభ్రం చేస్తానని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామి ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news