బావ హ్యాపీ బర్త్ డే..హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కల్వకుంట్ల కవిత

-

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీష్ రావు కు ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టు పెట్టారు.” బావా హ్యాపీ బర్త్ డే.. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి” అంటూ కవిత తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోలో కవితా మరియు హరీష్ రావు ఉన్నారు.

కాగా మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ శ్రేణులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి హరీష్ రావు. ఆలయ అధికారులు హరీష్ రావు కు సాదర స్వాగతం పలికారు. పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని అభిషేక సేవలో పాల్గొన్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి హరీష్ రావు. తర్వాత వేద పండితులు హరీష్ రావు కు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news