బీసీసీఐ అజింక్యా రహనే, ఛతేశ్వర పూజారా, హార్థిక్ పాండ్యాలకు షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఈ ముగ్గురు క్రికెట్లర కాంట్రాక్ట్ ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వీరి ఆటతీరును గమనించే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత ఏడాదిగా ఫామ్ లేక సతమతం అవుతున్నారు. ప్రస్తుతం ఛతేశ్వర పూజారా, అజింక్యా రహానేలు ‘ఏ’ గ్రేడ్ లో ఉన్న వీరిద్దరిని ‘బీ’ గ్రేడ్ కు మార్చారు. హర్థిక్ పాండ్యాను ‘సీ’ గ్రేడ్ కు తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
ప్రస్తుతం భారత ఆటగాళ్లను నాలుగు గ్రేడ్ లుగా విభజించి వార్షిక కాంట్రాక్ట్ ఇస్తోంది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ లుగా ఆటగాళ్లను విభజించారు.
గ్రేడ్ A+: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
గ్రేడ్ A: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, KL రాహుల్, మహ్మద్ షమీ మరియు రిషబ్ పంత్.
గ్రేడ్ B: చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ మరియు ఇషాంత్ శర్మ.
గ్రేడ్ C: శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్ మరియు దీపక్ చాహర్.