డబ్బులు వేరు కెమెరా చూపించే రంగులు వేరు..రంగులు మాత్రం అబద్ధాలు చెప్పిస్తాయి.డబ్బులు అందుకు ఉపయోగం అవుతాయి.వినియోగపడ్తాయి అని రాయాలి.ఆ విధంగా డబ్బులు ఎన్ని తక్కువ ఉంటే జీవితం అంత ఉన్నతిని కోరుకుంటుంది. తప్పుడు దారుల్లో వెళ్లి తెచ్చుకునే డబ్బులు వద్దు అని ఎప్పుడో చెప్పారు పవన్.
అదే తోవలో వెళ్తున్నారు సాయి పల్లవి కూడా! అందుకు నిదర్శనం ఆమె వ్యక్తిత్వం.అందుకు నిదర్శనం ఆమె నడవడి కూడా! కమర్షియల్ సినిమాలు చేసినంత మాత్రాన అన్ని పనులూ అదే ఫార్మెట్ లో ఉండాలని చేయాలని రూలేం లేదు.అందుకు విరుద్ధంగా ఆలోచించి సమాజం తప్పు తోవలో పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా పవన్ ది మరియు సాయి పల్లవి. పవన్ ఆ పని ఎప్పుడూ చేస్తారు. తప్పు తోవలో వెళ్లరు తనను అభిమానించే వారినీ వెళ్లనివ్వరు.అదేవిధంగా సాయి పల్లవి కూడా డబ్బు కోసం యాడ్స్ చేయరు.అవసరం అనుకుంటేనే వాణిజ్య ప్రకటనలను ఎంచుకుంటారు.
సినిమా వేరు,జీవితం వేరు.జీవితం కొన్ని పరిధులు కలిగి ఉండాలి.సినిమా కొన్ని పరిధులు చెరిపేస్తే బాగుంటుంది.జీవితం వేరు సినిమా వేరు.జీవితం రంగుల మయం కావాలంటే అందుకు సినిమా తోడు ఏ మాత్రం అవసరం లేదు.కానీ సినిమా రంగులమ యం కావాలంటే..కొన్ని జీవితాల రంగుల కలలు అందుకు ఉపయోగం అవుతాయి.వినియోగంలోకి ఎన్నో కలలు వచ్చేక జీవితం సినిమా రెండూ కలిసి ప్రయాణిస్తాయి.ఆ విధంగా జీవితం సాయి పల్లవిది.సినిమా సాయి పల్లవిది.సాయి పల్లవి అనే ఓ గొప్ప యాక్టర్ కు మాత్రమే సినిమా జీవితం వేర్వేరుగా ఉండవు.
జీవితంలో ఎలా ఉంటే అలానే సినిమాలో ఉంటారామె.కనుక పవన్ కు సాయి పల్లవికి కొన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. సినిమాల్లో చేస్తున్నాం కదా! అని వాణిజ్య ప్రకటనల్లో కనిపించాలని కోరుకోరు పవన్.అదేవిధంగా సినిమాలు చేస్తున్నాం కదా! అని వాణిజ్య ప్రకటనలు ఏవి పడితే అవి చేసేయ్యడం,అదీ డబ్బు కోసం కెమెరా ముందుకు రావడం అస్సలు ఇష్టం ఉండదు సాయి పల్లవికి.ఇవే మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.నిన్నమొ
అందుకనే..ఆడవాళ్లు మీకు జోహార్లు అని చెబుతున్నారు డైరెక్టర్ సుకుమార్.ఆడవాళ్లు మీకు జోహార్లు అని చెప్పిస్తున్నారు తిరుమల కిశోర్ అనే మరో డైరెక్టర్ కూడా! ఆయనే ఈ సినిమాకు రైటర్ కమ్ డైరెక్టర్.సాయి పల్లవీ మీకు జోహార్లు అని చెబుతున్నారు డైరెక్టర్ సుకుమార్. సాయి పల్లవీ మీరు గ్రేట్ అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.సినిమా చూస్తే హీరో శర్వాంనద్ ది..కానీ ప్రస్తావన అంతా పవన్ చుట్టూనే తిరుగుతుంది.సాయి పల్లవి చుట్టూ చక్కర్లు కొడుతోంది.అది కదా! వింత!
– బ్యూటీ స్పీక్స్ – మనలోకం ప్రత్యేకం