కరివేపాకు వల్ల కంటి ఆరోగ్యం నుండి కొవ్వు కరగడం వరకు ఎన్నో ఉపయోగాలు..!

-

కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో కూడా మనం ఎక్కువగా కరివేపాకుని వాడుతున్నాము. ఆయుర్వేద గుణాలు ఉండే కరివేపాకు వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు లో విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, జింక్, కాపర్, కాల్షియం ఉన్నాయి.

కరివేపాకు

అదే విధంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా కరివేపాకు రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అలానే అనారోగ్య సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ రసాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. దీని కోసం మీరు కొద్దిగా కరివేపాకు ఆకులు తీసుకుని రెండు స్పూన్లు నీళ్లు వేసి పేస్ట్ చేయండి. బాగా పేస్ట్ అయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టేయండి. వచ్చిన రసాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే ఎనీమియా సమస్య నుండి దూరంగా ఉండొచ్చు.

ఎక్స్ట్రా కొవ్వును కరిగించడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. రెగ్యులర్ గా దీన్ని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. జీర్ణ సమస్యలను పోగొడుతుంది కూడా. గ్యాస్, అజీర్తి సమస్యలు వంటివి కరివేపాకు రసం తో దూరం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news