గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్‌లో చాలామంది సీనియర్లు ఏ పదవీ లేకుండా వేచిచూస్తున్నారు. ఇందులో చాలామందికి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో మళ్లీ వీరికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ ఎఫెక్ట్ ఉన్న నేతలపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో పట్టున్న నేతలైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అలాగే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను టీఆర్ఎస్ వీడకుండా చూసేందకు కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవులు ఆరు ఖాళీ అవడంతో వాటిపై వీరి దృష్టి పడినట్టు తెలుస్తోంది.
ఇంకోవైపు ఈటల రాజేందర్ కారణంగా త్వరలోనే మంత్రి పదవుల విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరూ మంత్రి పదవి కోసం పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి ఇచ్చేది ఉంటేనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వమని కోరుతున్నారు. మరి కేసీఆర్ వీరిలో ఎవరికైనా మంత్రి పదవి ఇస్తారా లేక ఎమ్మెల్సీ పదవులతో సరిపెడతారా అన్నది చూడాలి.