ఆడవాళ్ళు అంటే అందం..అందం అంటే ఆడ వాళ్ళు.. ఇందులో నో డౌట్ అనే చెప్పాలి.ఈ మధ్య కాలంలో ఆహారంలో మార్పులు రావడం, కాలుష్యాల అందం తగ్గిపోతుంది. ఎప్పటిలాగా అందంగా కనిపించాలని వేలకు వేలు పొస్తారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడుతున్నారు..ఇంట్లో తయారు చేసిన క్రీములను వాడటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని సౌందర్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి పదార్థాలతో తయారు చేస్తారు ఎలా వాడాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం..
ముడతలను, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను శాశ్వతంగా తగ్గించడానికి ఈ ఫేషియల్ మసాజ్ లు తప్పనిసరి. ఇవి చర్మంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చెస్తాయో..అందుకే గ్లిజరిన్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె, బాదం ఆయిల్ క్రీమ్: ఈ ఫేషియల్ మసాజ్ కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనె , బాదం నూనెను కాస్త వేడి చేయాలి.అది వేడి అయ్యాక రోజ్ వాటర్ ను గ్లిజరిన్ ను వేసి బాగా కలపాలి.
ఈ క్రీమును గాలి లేని డబ్బాలో స్టోర్ చేసుకోవడం మేలు.. టాన్ పట్టినప్పుడు ఈ క్రీమును తీసుకొని ముఖానికి అప్లై చేసి చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల చర్మం ఎప్పుడూ నిర్జీవంగా మారదు. చాలా మృదువుగా అందంగా మారుతుంది..ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. చర్మానికి ఇంఫెక్షన్ రాకుండా కూడా ఈ క్రీము కాపాడుతుంది.