స్థలం ఉండి..ఇండ్ల నిర్మాణం చేపట్టేవారికి బడ్జెట్ లో ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయితే.. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు అని.. రూ.3 లక్షలు పెట్టారని భట్టి ఫైర్ అయ్యారు. ఇండ్లు లేని పేదలు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని… బడ్జెట్ పెరుగుతుంది .. మారి పేదల జీవితం మారాలి కదా..? అని నిలదీశారు.
గత ఎనిమిది ఎండ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని…ఫైర్ అయ్యారు. సంపద..అప్పుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని.. సాగు నీటి ప్రాజెక్టులపై రోజుకో వార్త వస్తుందన్నారు. కృష్ణ నదిపై కట్టే ప్రాజెక్టులకు అనుమతులు లేవని అంటున్నారని.. గోదావరి నీటిపై మరో పంచాయతీ ఉందని మండిపడ్డారు.
పెండింగ్ ప్రాజెక్టులు పరిస్థితి ఎంటి..? కాళేశ్వరం మూడో ఫేజ్ పనులు అంటున్నారు… పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే మనకు నీటి హక్కు ఏమైపోతుందోనని ప్రశ్నించారు. మంత్రి పైనా సూపారీ చేస్ పరిస్థితి వచ్చిందని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని నిప్పులు చెరిగారు. మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తె సామాన్యుడి పరిస్థితి ఎంటి.. సీఎం కెసిఆర్ …సుపారీ అంశం పై స్పందించాలన్నారు.