తెలంగాణలో భారీ వర్షాలకు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరద ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. పొడు భూముల బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, విభజన హామీ చట్టంలోని హామీలను తెలంగాణ సర్కార్ తీసుకురావడంలో విఫలం చెందిందన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విభజన హామీలపై కేంద్ర సర్కార్ ను నిలదీస్తానన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతి కూడా కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావిస్తారని, వరదల్లో ప్రజలు పూర్తిగా నష్ట పోయారన్నారు. క్యాంపులలో కూడా సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
తెలంగాణ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. గోదావరి పై బ్యారేజీ లు కట్టినప్పుడే బ్యాక్ వాటర్ తో ఇబ్బందులు అని అప్పట్లో కాంగ్రెస్ నేతలు లెవనెత్తారన్న భట్టి విక్రమార్క.. బ్యాక్ వాటర్ తో మంచిర్యాల ,మంథని, ములుగు,జగిత్యాల ,చెన్నూరు నియోజకవర్గలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. పంట నష్టంపై కూడా తెలంగాణ సర్కార్ అంచనాలు వేయలేదన్నారు భట్టి విక్రమార్క . వరదల వల్ల పంట నష్టంను వెంటనే తెలంగాణ సర్కార్ అంచనా వేయాలన్నారు భట్టి విక్రమార్క.