ఇబ్రహీంపట్నం సామాజిక ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో కు.ని. శస్త్రచికిత్సలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించింది. దీనిపై మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు తెలిపారు.
ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం ఘటనపై విచారణకు జాతీయ మహిళా కమిషన్ ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్ మెంబర్ సెక్రటరీ మీతా రాజీవ్‌లోచన్ దీనికి నేతృత్వం వహిస్తారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిష్పాక్షిక దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి కమిషన్ లేఖ రాసింది. దర్యాప్తును నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని తెలిపింది. ఘటనపై తీసుకున్న చర్యల గురించి 5 రోజుల్లోగా తమకు తెలియజేయాలని సూచించింది. ఘటనపై స్వతంత్ర విచారణ చేయాలంటూ సీఎస్‌కు మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ లేఖ రాశారు.