అమెరికా రహస్య పత్రాల లీక్.. తొలిసారి స్పందించిన బైడెన్

-

అమెరికా రక్షణ శాఖకు చెందిన పలు రహస్య పత్రాలు లీకైన వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలవరం కలిగిస్తోన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇంటిదొంగే రక్షణశాఖ రహస్య పత్రాలను ఫొటోలు తీసి మరీ లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఓ ‘వీడియోగేమ్‌ చాట్‌ రూమ్‌’లో ఈ రహస్య పత్రాలు కొన్ని రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చాయి. ఈ నెల 7 నుంచి ఇవి ప్రధాన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కూడా ప్రచారంలోకి వచ్చినా.. అసలు లీకేజీలు ఫిబ్రవరి- మార్చి మధ్యలోనే మొదలైనట్లు అనుమానిస్తున్నారు.

Joe Biden reacts during a moment of silence for the dead as he delivers remarks about Afghanistanm August 26, 2021. REUTERS/Jonathan Ernst

ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్.. తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. లీకైన పత్రాలు అంతగా ముఖ్యమైనవేమీ కావని బైడెన్ పేర్కొన్నారు. వాటిలో సమకాలీన సమాచారం లేదని తెలిపారు. అయితే రహస్యంగా ఉండాల్సిన పత్రాలు లీకవడం మాత్రం తనకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై తమ దేశ నిఘా, న్యాయ విభాగాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో బైడెన్‌ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news