ఎలాన్ మస్క్ విదేశీ సంబంధాలు అమెరికాకు డేంజర్..? : బైడెన్

-

ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాల వల్ల అమెరికా భద్రతకు ఏమైనా ఇబ్బంది వాటిల్లుతుందేమో పరిశీలించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వాఖ్యానించారు. ట్విటర్‌ కొనుగోలులో సౌదీకి చెందిన ఓ సంస్థ నుంచి మస్క్‌ సాయం తీసుకోవడం దేశ భద్రతకు ముప్పా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బైడెన్‌ పై విధంగా స్పందించారు.

‘‘నాకు తెలిసి ఎలాన్‌ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న సాంకేతిక సంబంధాలు, సహకారాల్లో సరికానివి ఏమైనా ఉన్నాయేమో అనే అంశం పరిశీలించదగినదే. కానీ అలాంటివి ఉన్నాయని నేను అనడంలేదు. పరిశీలించేందుకు అర్హమైనవని సూచిస్తున్నాను’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

మస్క్‌ గత నెలలో సోషల్‌ మీడియా వేదిక ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకొన్నాడు. ఈ కొనుగోలుతో సౌదీ రాకుమారుడు అల్‌ వలీద్‌ బిన్‌ తలాల్‌ సంస్థ ట్విటర్‌లో రెండో అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. ఈ నేపథ్యంలో సెనెటర్లు రాన్‌ వేడన్‌, క్రిస్‌ మార్పీ.. ట్విటర్‌ డీల్‌ను పరిశీలించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news