Big Boss OTT Telugu: శివను అనుమానించిన అషురెడ్డి.. బొమ్మల దొంగతనంపై హౌజ్‌లో డిస్కషన్..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ రోజురోజుకూ రసవత్తరమవుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తమ గేమ్ ఆడే క్రమంలో దూసుకుపోయే ప్రయత్నం చేశారు. హౌజ్ మెంబర్స్ అందరికంటే తామే ముందు ఉండాలనే రీతిలో గేమ్ ఆడారు. బీబీ లవర్స్ ను మరింత అట్రాక్ట్ చేసేందుకు నిర్వాహకులు భిన్నమైన గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు ‘బిగ్ బాస్’.

అషురెడ్డి వద్ద బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే టాస్క్ లో భాగంగా అషురెడ్డి వద్ద ఉన్న బొమ్మలను శ్రవంతి కొట్టేసింది. ఇంతలో హమీదా ..అషురెడ్డిని పిలిచింది. బయటకు వచ్చిన అషురెడ్డి తన వద్ద ఉన్న కాయిన్స్ ను ఎవరికి ఇవ్వబోనని చెప్పింది. హౌజ్ లో నుంచి బయటకు వచ్చిన అషురెడ్డి.. తన బొమ్మలను కాపాడుకోలేకపోయిందని బీబీ లవర్స్ కు అర్థమవుతోంది.

బొమ్మలను ఎవరు టచ్ చేశారనే విషయమై డిస్కషన్ అయింది. తన బొమ్మలను ఎవరో తీశారో తనకు తెలియదని, ఎవరో తీశారో వారికి చెప్పండని అషురెడ్డి అంది. ఇంతలోనే శివ జోక్యం చేసుకున్నాడు. ‘అసలు నీకు నా మీద ఎందుకు అనుమానం వచ్చింది?’ అంటూ శివ అషురెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. అలా కొంత సేపు వీరి మధ్య డిస్కషన్ జరిగింది.

ఇంతకు ముందు అషురెడ్డి వద్ద ఉన్న బొమ్మలను తీసుకునేందుకు అఖిల్ ఆమెను రిక్వెస్ట్ చేశాడు. కానీ, అషురెడ్డి మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. తాను తన వద్ద ఉన్న బొమ్మలు ఇవ్వబోనని చెప్పకనే చెప్పేసింది. మొత్తంగా మంగళవారం నాడు స్ట్రీమ్ అయిన ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందనే అభిప్రాయం బీబీ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news