Big Boss OTT Telugu: బాబా మాస్టర్‌కు సన్నీ లిప్ లాక్..రచ్చ రచ్చ చేసిన సీజన్ 5 టైటిల్ విన్నర్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT గేమ్ పదో వారంలోకి ఎంటరయింది. ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇంటిలోకి స్పెషల్ గెస్టులు వస్తున్నారు. శనివారం స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. సన్నీ రాకతో ఇంటి సభ్యుల్లో జోష్ వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ను బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

సదరు ప్రోమోలో మంకీ బిజినెస్ టాస్క్ లో గెలిచేందుకు కంటెస్టెంట్స్ పోటీ పడుతుండటం చూడొచ్చు. ఈ క్రమంలోనే తనను ముసలోడని అంటావా? అని బాబా భాస్కర్ మాస్టర్ అరియానా పై ఫైర్ అవుతాడు. అప్పుడే వీజే సన్నీ ఎంట్రీ అదిరిపోతుంది. వీజే సన్నీ బాబా మాస్టర్ కు లిప్ లాక్ ఇవ్వబోతాడు.ప్రతిగా బాబా మాస్టర్ సైతం లిప్ లాక్ ఇచ్చేస్తాడు. అలా ఇంటిలో రచ్చ రచ్చ జరుగుతుంది.

‘నువ్వు హ్యాండ్ సమ్ సన్నీ’..అనిఅరియానా అంటోంది. అంతలో సాంగ్ ప్లే అవుతుండగా కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తుంటారు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version