తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. అసలే అంతగా ఫేమ్ లేని వారు రావటం వల్ల రేటింగ్ రావడం లేదు. అలాగే ఆడే వారు కూడా దెబ్బలు తగలకుండా , ఎవరికి ఇబ్బంది లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు. ఇక రీసెంట్ ప్రోమోలో కంటెస్తెంట్ లతో పాటు, చూసే వాళ్ళని కూడా బిగ్ బాస్ ఎడిపించాడు.
తర్వాత నా డ్యాన్స్ దరిద్రంగా ఉందా అని ఆదిరెడ్డి అడిగితే.. లేదు నవ్వుకున్నాం అని కవిత చెప్పింది. ఏంటి నువ్ కూడా నవ్వుకున్నావా అని తల బాదుకున్నాడు. కవిత మాట్లడుతూ అందరూ మంచి వాళ్లు.. గేమ్ వరకు మీరు కొట్టుకోండి.. తిట్టుకోండి అంటే.. నన్ను కూడా కొట్టొచ్చా అని ఆదిరెడ్డి అడిగాడు. దీనికి హా.. నువ్ ఏమైనా తోపా.. అని ఆదిరెడ్డిని సరదాగా కామెంట్ చేసింది.ఇంటి సభ్యులందరి ముందు ఆదిరెడ్డి కోరుకున్నట్లుగానే అతని పాప బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇది చూసి సింగర్ రేవంత్ తన రీసెంట్ గా పుట్టిన తన కూతురు గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ చూసే వాళ్ళను కూడా ఎడ్పించాడు.