బిగ్ బాస్ విన్నర్: గూగుల్ ను తప్పుదారి పట్టించిందెవరు

-

21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఆరుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే కొద్దిగా మాత్రమే టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు తెలుస్తోంది. గత  వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో బాగంగా స్ట్రాంగ్ , ఫైర్ బ్రాండ్ అయిన ఇనయా ఎలిమినేషన్ అయ్యింది. ప్రస్తుతం 6గురు ఇంటి సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు వారం మధ్యలోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

అది ఆది రెడ్డి కాని లేదా శ్రీ సత్య అంటున్నారు.అయితే ప్రస్తుతం ఈ ఆరుగురిలో విజేత ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా నడుస్తుంది. అందరూ టైటిల్ ఫెవరెట్ గా సింగర్ రేవంత్. ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే తనకు తన అగ్రెసివ్ ఆట తీరు తోడు, ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు బాగా కలిసి వచ్చాయి.బిగ్ బాస్ టీమ్ సైతం రేవంత్ ని విన్నర్ గానే ప్రోజెక్ట్ చేస్తూ వస్తుంది. అలాగే సింగర్ అయిన రేవంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

అందరూ రేవంత్ ను విన్నర్ అంటుంటే వారి ఆశలు ఓమ్ము చేసేలా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్  షాక్ ఇచ్చింది. ఈ సీజన్ విన్నర్ రేవంత్ కాదని అంటోంది.స్లో అండ్ స్టడీ గేమ్ తో అనూహ్యంగా క్రేజ్ దక్కించుకున్న కంటెస్టెంట్ రోహిత్  పేరుని విజేతగా గూగుల్  చూపిస్తోంది. మీరు బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు విన్నర్  అని కొడితే రోహిత్  అంటూ జవాబు ఇస్తోంది. దీని వెనక రోహిత్ భార్య, వాళ్ల టీం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో రేవంత్ అభిమానులు ఇరిటేట్ అవుతున్నారు. ఇక ఇది చివరి దశకు చేరింది కాబట్టి కొద్ది రోజుల్లొ అసలైన విన్నర్ ఎవరో తెలిసి పోతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version