సీజన్ ను బట్టి మన నివాస ప్రాంతాలలో దోమలు అధికంగా ఉంటాయి. అయితే దోమల కాటు వలన అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని చంపడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాము. అందులో భాగంగా మార్కెట్ లో అనేక రకాల రసాయనాలు అంధుబాటులో ఉన్నాయి. మస్కిటో కాయిల్స్ , మస్కిటో స్టిక్స్ … ఎలక్ట్రిక్ నెట్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇవి వాడడం దోమలకే కాదు మనకు కూడా చాలా ప్రమాదం అని తెలిసిన వాడుతుంటాము. అయితే తాజాగా ఢిల్లీ లో ఈ మస్కిటో కాయిల్ వాడడం వలన మొత్తం ఆరు మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
ఒక నివాసంలో దోమలను సంహరించదునైకి రాత్రి సమయంలో మెస్కిటా కాయిల్ ను పెట్టి ఇంట్లో సభ్యులు అంత నుదిరలోకి జారుకున్నారు. అయితే ఈ కాయిల్ వలన వెలువడిన ప్రమాదకరపు కార్బన్ మోనాక్సయిడ్ ను ఆరుగురు పీల్చడంతో నిద్రలోనే వీరు మరణించినట్లు తెలుస్తోంది. అయితే వీరు ఏసీ ఆన్ చేసి కాయిల్ ను ఆన్ చేశారట.. ఇది ప్రమాదం అయిందని పోలీసులు తెలిపారు.