గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిగ్ రిలీఫ్. గోదావరి నది ప్రస్తుతం భద్రాచలం వద్ద నిలకడగా కొనసాగుతుంది .ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.8 అడుగుల వద్ద ఉన్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 11 లక్షల క్యూసెక్కుల కు పైగా దిగువకి ధవలేశ్వరం వైపు గోదావరి వరద వెళుతుంది.
గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలతో ఇంద్రావతి, ప్రాణహిత నుంచి భారీగా వరదరావడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా గేట్లు వదిలేసి పది లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకి విడుదల చేశారు. తుపాకుల గూడెం ప్రాజెక్టు ఎత్తు స్థాయికి ఎంత మించి నీటి ప్రభావం రావటంతో మొత్తం నీటిని విడుదల చేశారు.
కాలేశ్వరం, మేడిగడ్డ, ఏటూరు నాగారం, పేరూరు లో వరద స్థాయి తీవ్రత తగ్గింది. పేరూరు . ఏటూరు నాగారం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగి తగ్గటం ప్రారంభమైంది. ఇకపోతే ఎగువన ఉన్న దుమ్ముగూడెం లో కూడా వరద తగ్గిపోవడం ప్రారంభమైంది. భద్రాచలం వద్ద గత రాత్రి 7 గంటల నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు 51.8 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతుంది. 12 గంటల నుంచి నిలకడ గానే వుంది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ సాయంత్రానికి గోదావరి భారీగా తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి వర్షం లేకపోవడంతో గోదావరి వరద పూర్తిస్థాయిలో తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు.