ఏపీ వాహనదారులకు బిగ్ షాక్..ఇచ్చింది జగన్ సర్కార్. ఏపీలో వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ఫీజులు పెరిగాయి. నంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తాజా నిర్ణయంతో నంబర్లపై ఏట రూ.20 కోట్ల మేర అదనంగా వసూలు అవుతాయని భావిస్తున్నారు. ఇక బాగా డిమాండ్ ఉంటే 9999 నంబర్ కావాలనుకునేవారు, గతంలో రూ. 50 వేలు చెల్లించే ఆన్లైన్ ద్వారా వేలంలో పాల్గొనేవారు.
ఈ నంబర్ కు ఎవరు ఎక్కువ రేటుకు ఆసక్తి చూపిస్తే ఆ నంబర్ వారికి దక్కుతుంది. ఇప్పుడు ఈ కనీస మొత్తం రూ. 2లక్షలకు పెరిగింది. అలాగే 1,9,999 నంబర్లు కావాలంటే లక్ష చెల్లించి ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలి. ఇక 99, 3333, 4444, 5555, 6666, 7777 వంటి ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకుంటే, కనీసం రూ. 50 వేలు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ అనంతరం వాహనాలకు కేటాయించే ఫ్యాన్సీ నంబర్ల ధరలు పెరిగాయని, ఈ కొత్త ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి.