డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి జగన్ షాక్.. ఆ పదవీ నుంచి ఔట్ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయన శాఖల్లో కోత విధిస్తూ…సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ను నారాయణ స్వామి నుంచి తప్పించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖ ను ఆర్థిక మంత్రి బుగ్గన కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్.

దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో భావించింది ఏపీ ప్రభుత్వం. అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం తో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో అప్పటి ప్రతిపాదలను ఇప్పుడు అమలు చేసింది జగన్‌ సర్కార్‌. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. త్వర లోనే మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version