పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని.. అసలు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం ఏఐసిసికి తప్ప ఎసిసికి లేదని మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంపించారు మహేశ్వర్ రెడ్డి. ఆయన బిజెపి పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో బీజేపీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు మహేశ్వర్ రెడ్డి. రాజీనామా చేసిన కాసేపటికే ఢిల్లీలో బిజెపి నేతలతో సమావేశం అయ్యారు. ఈటల రాజేందర్ తో కలిసి తరుణ్ చుగ్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. త్వరలోనే బిజెపిలో చేరతానానికి చెప్పారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు.