బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, బీజేపీ రాజకీయాలకు బలి అయినట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తప్పుకోబోతున్న గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారని, అయితే గంగూలీ దానిని సున్నితంగా తిరస్కరించాలని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది.
సబ్ కమిటీకి హెడ్ గా ఉండేందుకు అతడు అంగీకరించలేదని బీసీసీఐ బాస్ గా కొనసాగేందుకు గంగూలీ ఆసక్తిగా ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ట్రెజరర్ గా ఉన్న అరుణ్ సింగ్ ధూమల్ ఐపిఎల్ చైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే ఈ విషయంలో వెంటనే ఓ నిర్ణయం తీసుకోకుండా గంగూలీని సంప్రదించిన తర్వాతే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. గంగూలీ కనుక ఐపీఎల్ చైర్మన్ షిప్ ను తిరస్కరిస్తే అప్పుడు ధూమల్ కు దానిని కట్టబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. బిసిసిఐ కేబినెట్ లో అత్యంత సమర్థవంతమైన వ్యక్తులలో ఒకరిగా ధూమల్ కు పేరు ఉంది.