ఎల్బీ నగర్ లో నిన్న ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ ప్రేమోన్మాది దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎల్బీ నగర్ లోని నవీన హాస్పిటల్ లో యువతికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం బాధిత యువతి కండిషన్.. క్రిటికల్ గానే ఉంది. తన తో పెళ్లి నిరాకరించిందని కక్షతో 18 కత్తి పోట్లు పొడిచాడు ఆ ఉన్మాది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.
గత కొంతకాలంగా ఎల్బీనగర్ లోని హస్తినాపురంలో తన పిన్ని తో కలిసి ఉంటున్న యువతి… గతంలో బాధిత యువతి మధ్య నిందితుడు బస్వరాజు ప్రేమాయణం చోటు చేసుకుంది. అయితే… బస్వరాజు తో పెళ్లికి నిరాకరించారు శిరీష తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే… శ్రీధర్ అనే వ్యక్తి తో ఇటీవల శిరీషకు ఎగేంజ్ మెంట్ చేశారు ఆమె తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న బస్వరాజు శిరీష పై అక్కసు తో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. దాడి లో తీవ్రంగా గాయపడింది శిరీష. ఇక ఇప్పటికే నిందితుడు బస్వరాజు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.