బిగ్ బాస్ -6: అందరూ అన్నయ్యలే అంటున్న శ్రీ సత్య.. కారణం అదేనా..?

-

తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్-6 స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోంది.. ఇక బిగ్ బాస్ హౌస్ లో గత కొద్దిరోజుల నుంచి దొంగ పోలీస్ టాస్క్ జరుగుతూనే ఉంది. అయితే 3 రోజుల పాటూ కొనసాగిన ఆ టాస్క్ పూర్తి అవ్వడం జరిగింది. అందులో ఎక్కువగా బొమ్మలు కాపాడుకున్న పోలీసులు విజయం సాధించారు. అయితే అందులో పోలీస్ గా ఉన్న శ్రీ సత్య మాత్రం టాస్క్ గ్యాప్ లో రేవంత్ తో కాసేపు మాట్లాడడం జరిగింది. అయితే ఆ పక్కనే ఉన్న అర్జున్ ను చూసి హౌస్ లో అందరూ నాకు అన్నయ్య లే అంటూ మొదలు పెట్టింది. దీనికి రేవంత్ నేను యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్తాడు. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు.. అన్నయ్య అని యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది వాళ్లకే వదిలేస్తున్నాను అంటూ తెలిపింది.

అసలు శ్రీ సత్య ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని నెటిజన్స్ సైతం ఆరా తీస్తున్నారు. ఇకపోతే గతవారం నాగార్జున వచ్చినప్పుడు అర్జున్ , శ్రీ సత్య మధ్య ఏముంది అని ఆడియన్స్ ని నాగార్జున అడిగారు దీనికి ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతూ సంథింగ్ సంథింగ్ అంటూ ఆడియన్స్ చెప్పడంతో శ్రీ సత్య ఫేస్ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారని అప్పుడు సైలెంట్ గా ఉన్నా కూడా ఆ తర్వాత అర్జున్ ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ వచ్చింది శ్రీ సత్య… కానీ అర్జున్ మాత్రం శ్రీ సత్య చుట్టూనే తిరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే టాస్క్ లో దొంగగా ఉన్నా కూడా శ్రీ సత్య పక్కనే కూర్చున్నాడు . దీంతో శ్రీ సత్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అన్నయ్య అని నేను పిలుస్తాను అన్నప్పుడు శ్రీహాన్ నన్ను చెల్లిగా యాక్సెప్ట్ చేశాడు. మీరు చేస్తారో చేయరో అన్నది మీ ఇష్టం అంటూ మాట్లాడింది. నేనేం చేసినా క్లియర్ గా ఉంటాను నేను ఫోన్ మాత్రమే చేస్తాను అంటూ అర్జున్ పక్కనే కూర్చుని మాట్లాడింది.. ఇకపోతే ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్.. హౌస్ లో ఉన్న వారితో లవ్ ట్రాక్ నడిపించే ప్రయత్నం చేశాడు.. కానీ శ్రీ సత్య అందుకు ఒప్పుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news