బిగ్ బాస్: శ్రీహాన్ తో పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సిరి..!

సోషల్ మీడియా ద్వారా క్రేజీ సంపాదించుకొని లవర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీహాన్, సిరి ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా పాపులారిటీ అయిన సిరి.. షణ్ముఖ్ జస్వంత్ తో సన్నిహితంగా మెలగడంతో షణ్ముఖ్ లవర్ దీప్తి సునయన కూడా దూరమైంది. అప్పట్లో వీరిద్దరూ కలవాలని ఎన్నో కామెంట్లు కూడా వచ్చాయి.. కానీ వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఇకపోతే షణ్ముఖ్.. దీప్తి సునైన ఒకరికొకరు దూరమైన తర్వాత సిరి, శ్రీహాన్ మాత్రమే కలిసి ఉన్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శ్రీహాన్ కంటెస్టెంట్గా ప్రస్తుతం పాల్గొన్న విషయం తెలిసిందే.

సిరి ఎంటర్టైన్మెంట్ అందించిన స్థాయిలో శ్రీహన్ అందించలేదని కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే తాజాగా సిరి హనుమంత్.. శ్రీహాన్ తో పెళ్ళి గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. నిజానికి బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీహాన్ బయటికి రాగానే శ్రీహాన్ తో సిరి హనుమంత్ పెళ్లి చేసుకుంతాను అని చెప్పింది సిరి.. ఇక శ్రీహాన్ విన్నర్ గా నిలిస్తే ఈ సంవత్సరంలోనే పెళ్లి జరుగుతుందని ప్రామిస్ చేయమని సిరి హనుమంత్ ని ఒక నెటిజన్ అడగగా.. ఐ యామ్ సిగ్గింగ్ ఇక్కడ అని కామెంట్ చేసింది సిరి. మరొక నెటిజన్ ఏమో సిరి చాలా హైపర్ గా ఉంటుంది.. శ్రీహాన్ చాలా కూల్ గా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు..

మరొక నెటిజన్ ఏమో అక్క.. బావ నీతో కోపంగా ఉంటాడా అని అడగగా.. సమస్యే లేదని.. నాకే చాలా ఓపిక తక్కువ అని, శ్రీహానికి ఓపిక చాలా ఎక్కువ అని కూడా కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక వీరి జంట బాగుంటుందని నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తే ఇదే ఏడాది శ్రీహాన్ సిరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. బిగ్ బాస్ లోకి రాకముందే వీరిద్దరూ పలు వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.