బిజినెస్ ఐడియా: బైక్ సర్వీసింగ్ తో అదిరే రాబడిని పొందండి..!

-

మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? అయితే ఏ వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. దీనిని కనుక చేస్తే అదిరిపోయే లాభాలు పొందొచ్చు. అదే బైక్ సర్వీసింగ్ బిజినెస్. బైక్ సర్వీసింగ్ చేస్తే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు.

మీరు కనుక బైక్ సర్వీసింగ్ సెంటర్ పెట్టాలనుకుంటే మెయిన్ రోడ్డు మీద ఒక షాపు అద్దెకి తీసుకోవాలి. దీని కోసం మీకు నెలకు పదివేల రూపాయలు ఖర్చు అవుతాయి. లేదు అంటే మీరు మీ ఇంటి నుండి కూడా ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. అప్పుడు మీకు పదివేల రూపాయలు కూడా సేవ్ అవుతాయి.

బైక్లు, కార్లు వంటివి క్లీన్ చేసి ఇవ్వడమే మీ పని. వాటర్ సర్వీసింగ్ కి డిమాండ్ బాగా ఉంది. వాటర్ సర్వీసింగ్ మిషన్ కోసం పది వేల రూపాయలకు దొరుకుతుంది. ఇంజన్ ఆయిల్, స్పేర్ పార్ట్స్ వంటివి కూడా మీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఒక బైక్ సర్వీస్ చేయడానికి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చెయ్యచ్చు. రోజుకి రెండు బైకులు సర్వీసింగ్ చేసినా నెలకి 25 రోజుల పాటు 25 వేల వరకూ చార్జ్ చేయవచ్చు. బైక్ సర్వీసింగ్, అలాగే వాటర్ సర్వీసింగ్ కలిపి నెలకు రూ. 50 నుంచి రూ. 60 వేల దాకా వస్తాయి. ఇలా ఈ బిజినెస్ తో మంచిగా లాభాలు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version