రికార్డులు సృష్టిస్తోన్న బింబిసార .. 50 శాతం రికవరీ..!

-

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసారా. ఈ బింబిసార మూవీ శుక్ర‌వారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లోకి కొత్త ఊపు తీసుకొస్తోంది. బింబిసారుడిగా క‌ళ్యాణ్ రామ్ అదరగొట్టాడని అంటున్నారు. ఫస్ట్ షో నుంచి మౌత్ టాక్ బాగుండ‌టంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.

దాంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు నంద‌మూరి ఫ్యాన్స్. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సగం వసూళ్లు రాబట్టి.. కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయ్యెస్ట్ వసూళ్లను రాబట్టి.. రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏపీ, తెలంగాణ కలిపి.. మొత్తం 6.30 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. గ్రాస్ వసూళ్ల ప్రకారం.. 9.30 కోట్లని అని ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సుమారు 13.5 కోట్ల రూపాయలకు అమ్మినట్టు టాక్. ఈ లెక్కన ఫస్ట్ డే 6 కోట్లకు పైగా రాబట్టింది కాబట్టి.. 50 శాతం రికవరీ అయినట్టేనని అంటున్నారు. అలాగే ఓవర్సీస్‌లో కూడా ‘బింబిసార’ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news