ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు రెవెన్యూ సదస్సుల్లో హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు సంజయ్‌. పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్రయంత్రాంగాన్ని అంతా తీసుకుని వచ్చి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో కేసీఆర్‌ ఇచ్చిన హామీని బహిరంగ లేఖలో గుర్తు చేసిన బండి సంజయ్‌… నవంబర్‌ 23, 2018న మహబూబాబాద్‌ బహిరంగసభలో అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడురైతులకు పట్టాలు అందజేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని బహిరంగలేఖలో ప్రస్తావించారు.

కుర్చీవేసుకుని గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమైతే బిజెపి తెలంగాణ శాఖ, గిరిజనులు, ఆదివాసీలు కుర్చీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని.. కేసీఆర్‌ కుర్చీవేసుకుని పట్టాలు ఇప్పించకపోయినా పర్వాలేదు, కనీసం జులై 15 వ తేదీ నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటే అదే పదివేలు అన్నారు.

రాష్ట్రప్రభుత్వం పోడుభూములు సాగుదారులనుండి ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా జాబితాను రెవెన్యూ సదస్సుల కన్నా ముందే ప్రకటించాలని.. పోడుభూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు అటవీ, పోలీస్‌, రెవెన్యూశాఖల అధికారులు జోక్యం చేసుకోకూడదు, దాడులను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news