పండ్ల తోటలో అధిక దిగుబడి పొందాలంటే రైతులు ఇలా చెయ్యాలి..

-

ఏదైనా పంట వేస్తే మంచి దిగుబడి రావాలని ప్రతి ఒక్క రైతు అనుకుంటారు. అయితే, కొన్ని కారణాల వల్ల అంటే అధిక వర్షాలు, లేదా మరేయితర సమస్యల వల్లనో అనుకున్న ఫలితాలను పొందలేరు..దాంతో నష్టాలను చూస్తారు. చాలా మంది ఈ మధ్య చేస్తున్న ఉద్యోగాలను మానేసి మరీ వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఒక అభిరుచి మాత్రమే కాదు, వృత్తిపరమైన రంగంగా మారింది..ప్రకృతిని ఇష్టపడే వారికి ఇది బెస్ట్..

ఉద్యానవనంలో నాణ్యమైన విత్తనాలు, పండ్లు మరియు పువ్వులు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణాన్ని పెంచడానికి కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విభిన్నమైన నేలలు మరియు వాతావరణాలతో మన దేశంలో అనేక రకాల వ్యవసాయ-పర్యావరణాలు ఉన్నాయి, ఇది వివిధ రకాల ఉద్యానవనాలు మరియు పంటలను పండించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హైటెక్ గ్రీన్హౌస్లు, అంతర్గత పరిశోధనలు మరియు ఆఫ్-సీజన్ వ్యవసాయం ఉద్యానవన రంగంలో కొత్త అవకాశాలను తెరిచాయి.

భారతదేశం ప్రపంచంలోనే పండ్లు మరియు కూరగాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా ఉండటానికి కారణం ఇదే..

*.మనం వేయాలనుకున్న ఫలజాతి కి అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఆ ప్రాంతంలో వర్షపాతపు తీరు, గాలి ఉధృతం వేడిగాలుల బెడద మొదలైన విషయాలను కూలంకుషంగా పరిశీలించాలి.
*. ఆ ప్రాంతంలోని యితర రైతులు అదే ఫలజాతి తోటలను వేసినట్లయితే వారి అనుభవాలను సేకరించాలి.
*. భూసార పరీక్షలు జరిపించి, వేయబోయే ఫలజాతులకు నేలలు అనుకూలమా కాదా అని నిర్ధారించాలి.
*. నేలలోతు కనీసం రెండు మీటర్లుండాలి. కనీసం 2 మీ., దిగువ నీటి మట్టం ఉంటేనే ఆ నేల పండ్ల తోటల సాగుకు పనికి వస్తుంది.
*. వీలయినంత దగ్గర్లో పెద్ద పండ్ల మార్కెట్ ఉన్నట్లయితే రవాణా ఖర్చులు తగ్గటమే కాక రవాణాలో కాయ దెబ్బ తినక పండ్లు త్వరగా కొనుగోలు దారుకు చేరే అవకాశం ఉంది.
*. మంచి రోడ్లు, రవాణా సదుపాయాలు, శీతలీకరణ సదుపాయంలో గల ట్రక్కులు అందుబాటులో ఉండాలి..
*. ఇతరులు వేసిన పండ్ల తోటలు దగ్గరగా ఉంటే అనేక సదుపాయాలు సహకార ప్రాతిపదికన తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు..
*. మొక్కలు, ఎరువులు, మందులు అందుబాటులో ఉండాలి…
*. పండ్ల మొక్కలను వేసే భూమి తక్కువ ధరలో వచ్చేలా చూసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news