మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని నేడు, రేపు వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని గుర్తుతెచ్చుకుంటూ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు.”నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుందని… ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకమని ” ట్వీట్ చేశారు.
నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2022