బీజేపీ ఎమ్మెల్యేలను చూసి టీఆర్ఎస్ భయపడుతోంది…అందుకే సస్పెండ్ చేసింది: కిషన్ రెడ్డి

-

ఏ కారణం లేకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని.. బీజేపీ ఎమ్మెల్యేలను చూసి టీఆర్ఎస్ భయపడుతుందని.. అందుకే సస్పెండ్ చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిరసన తెలియజేస్తూ.. నినానాాలు ఇస్తే మొత్తం సమావేశాల్లో  పాల్గొనకుండా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ ముఖంపై ప్లేకార్డ్ లు పెట్టినా.. ఎక్కడా కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. బడ్జెట్ ప్రసంగం రెండు పేజీలు చదవకుండానే.. ప్రగతి భవన్ లో ముందే రాసిన సస్పెండ్ తీర్మాణాన్ని ఒక పథకం ప్రకారం శాసన సభలో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను చదివి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఈటెల రాజేందర్ ముఖం చూడనని అన్న సీఎం.. ఆయనను శాసన సభలో ఆయన ముఖం చూడొద్దనే  ఇలా చేశారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేఖతకు సస్పెన్షన్ వ్యవహారం అద్దం పడుతుందని అన్నారు. ప్రశ్నించే అధికారం లేకుండా రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్ గొంతునొక్కే ప్రయత్నం ఇదని విమర్శించారు కిషన్ రెడ్డి. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీయేతరులను, కల్వకుంట్ల కుటుంబం కాని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news