రేపటి అమిత్ షా సభకు చాలా ప్రాధాన్యం… తండ్రి కొడుకుల పాలనకు అంతం: కిషన్ రెడ్డి

-

అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. రేపటి పర్యటనకు చాలా ప్రాధాన్యత ఉందని… రాష్ట్రంలో తండ్రికొడుకుల పాలన, కుటుంబ పాలనకు అమిత్ షా చరమగీరం పాడబోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉందని విమర్శించారు. బడ్జెట్ లో పెట్టినట్లు నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. తెలంగాణ పూర్తి గా అభివృద్ధి చేసిన ఇక దేశాన్ని ఉద్దరించాలని పగటి కలలు కంటున్నారని….పగటి కలలకు ఖర్చు ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కల్వకుంట్ల పాలన గుప్పిట్లో ఉండాలని కలలు కంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనపై తీవ్ర వ్యతిరేఖత ఉందని… హుజూరాబాద్ , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని విమర్శించారు. రేపటి సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. టీఆర్ఎష్ ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని.. గొప్పలు చెబుతున్నారని… వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి రైతులకు వాస్తవాలు చెబుతామని అన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version