ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు వాపులు వంటి బాధలు పడుతున్నారు. ఆర్థరైటిస్ వలన కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. ఆర్థరైటిస్ అనేది కీళ్లనొప్పి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి వాపు కలగడం ఎముకలు స్టిఫ్ గా అయిపోవడం ఇలా. కీళ్లలో కదలికలు తగ్గడం ని ఆర్థరైటిస్ అని అంటారు. వయసు పెరిగే కొద్దీ ఇటీ మరింత తీవ్రంగా మారుతుంది. మన ఇండియాలో చూస్తే 180 మిలియన్లకి పైగా ఆర్థరైటిస్ పేషెంట్లు ఉన్నారు.
మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. ఆర్థరైటిస్ వలన రోజువారి పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆథరైటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో వాపును తగ్గిస్తాయి ఆకుకూరలు. ముఖ్యంగా పాలకూర తీసుకోవడం వలన ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా తగ్గిస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఈ నూనె ఉపయోగించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలానే బాదం, వాల్ నట్స్ వంటి నట్స్ ని తీసుకుంటే కూడా ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. కమల పండ్లను బెర్రీస్ ని తీసుకుంటే కూడా ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించవచ్చు. శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి ఇవి ఇలా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు వీటిని డైట్ లో చేర్చుకోవడం వలన ఉపశమనాన్ని పొందొచ్చు.