తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగానే కృషి చేస్తుంది. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూడా తీవ్రంగానే కష్టపడుతున్నాయి. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బీజేపీ నేతలు కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. చిరంజీవిని వాడుకోలేకపోతున్నారు అనే భావన ఉంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009లో తిరుపతి ఎమ్మెల్యే సీటు నుంచి విజయం సాధించారు.
కాబట్టి ఆయనను తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎంతోకొంత వాడుకుంటే మంచి ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. కానీ ఈ విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించడం లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా చిరంజీవి తో సంప్రదింపులు జరిపి ఆయన ప్రచారానికి కనీసం ఒక్కరోజు అయిన సరే ప్రచారం చేస్తే బాగుంటుంది అని కొంత మంది కోరుతున్నారు. మెగా ఫ్యామిలీ లో కూడా కొంత మంది బీజేపీకి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కనీసం వాళ్ళను అయినా సరే వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా సరే బీజేపీ ముందడుగు వేయడం లేదు. కనీసం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపే ప్రయత్నం బీజేపీ నేతలు చేయలేక పోతున్నారు అని ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో ఈ పరిణామాలన్నీ కూడా ఇబ్బంది కరంగా మారే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.