కమలం గూటికి క్యూ కడుతున్న గ్రేటర్ కాంగ్రెస్ నేతలు..క్యూలో ఉన్నది వీరే

Join Our Community
follow manalokam on social media

టీ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయ్‌. ఇప్పటికే నాయకత్వ సమస్యతో బాధపడుతున్న పార్టీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. ఇంకా బీజేపీలో చేరేందుకు క్యూలో ఉన్నది ఎవరు..గ్రేటర్ లో కాంగ్రెస్ నాయకులు కమలం గూటికి వెళ్ళడానికి క్యూ కట్టారా..తెలంగాణ వ్యాప్తంగా కాషాయ జెండా కప్పుకొక్కువడానికి సిద్ధమైతుంది ఎందరు అన్నదాని పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ కండువా కప్పేసుకున్నారు. పార్టీ పట్ల కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న కూన కాంగ్రెస్ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో కూన శ్రీశైలం కండువా కమలం గూటికి చేరారు.గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధకలిగిస్తున్నాయన్నారు కూన.పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగే కారణం పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనాని చెప్పుకొచ్చారు.

కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ పార్టీలో చేరిపోయారు. అయితే..ఇప్పుడు ఇంకా ఎంత మంది క్యూలో ఉన్నారనేది చర్చకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. రమేష్ రాథోడ్,మహేశ్వర్ రెడ్డి తో పాటు..గడిచిన ఎన్నికలల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసిన మరో నాయకుడు కూడా కండువా మార్చేయడానికి సిద్ధమయ్యారని టాక్.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెరేళ్ల శారదా కూడా చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మీద అసంతృప్తి తో ఉన్నారని సమాచారం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే కండువా కప్పుకుంటారని ప్రచారం నడుస్తుంది.ఇప్పటికే హైదరాబాద్‌లో నాయకుల కొరత ఉన్న నేపథ్యంలో..కూన శ్రీశైలం కూడా పార్టీ మారడం తో పార్టీ కి కొంత ఇబ్బందికమైన పరిస్థేనంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్‌.

 

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...