ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు శుభాభినందనలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల ప్రభుత్వం నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించారు. అయితే ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ లు బాగా వినిపిస్తున్నాయని.. అయితే కేంద్రం జోక్యం చాలా పరిమితం గా ఉంటుందని ఆయన తెలిపారు. ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని బీజేపీ ప్రశ్నించింది. మళ్ళీ మూడు రాజధానుల పేరుతో అవినీతికి పాల్పడితే మాత్రం ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు.
అలాగే అమరావతి రైతులు, ప్రజలకు పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి చూడడం మంచిదని ఆయన అన్నారు. అసలు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కే ఒక రాష్ట్రం ఉంటే ఆంధ్రప్రదేశ్ కి మూడు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం జహాయమని ఆయన అన్నారు.