AIIMS న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పి.శరత్ చంద్ర బ్లాక్ ఫంగస్ గురించి చెప్పారు.కరోనా పేషంట్స్ లో ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది అన్న సంగతి మనం విన్నాం. అయితే దీనికి సంబంధించి ఆయన కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది.
వాటి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలు చూసుకుంటే.. డయాబెటిస్ ఎక్కువగా ఉండడం, స్టెరాయిడ్స్ ని ఉపయోగించడం దానితో పాటుగా tocilizumab ని వాడడం, కరోనా ట్రీట్మెంట్ తర్వాత ఆరు వారాల్లో ఆక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు రావడం..
ఇలాంటి సమస్యలు కనుక ఉంటే బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు అదే విధంగా డాక్టర్ చంద్ర మరొక విషయం కూడా చెప్పారు. డైరెక్ట్ గా కోల్డ్ ఆక్సిజన్ సిలిండర్ నుండి ఆక్సిజన్ ఇవ్వడం ప్రమాదకరమని చెప్పారు.
అంతే కాకుండా రెండు నుంచి మూడు వారాల పాటు ఒకే మాస్క్ ఉపయోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యాంటీ ఫంగల్ డ్రగ్ posaconazole ని బ్లాక్ ఫంగల్ రిస్క్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇవ్వొచ్చని చెప్పారు.