రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. స్నేహం ముసుగులో చేయరాని పనులు చేస్తున్నారు. అయితే.. కోరిక తీర్చాలని, లేకుంటే మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. మధురానగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న యువతి(27) యాంకర్‌గా పనిచేస్తోంది. కళాశాలలో చదివే రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె.సామ్రాట్(30)తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె నిరాకరించింది.
స్నేహితుల్లా ఉందామని నమ్మబలికాడు. గతంలో ఓసారి కారులో యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారానికి యత్నించాడు. ఆమె తప్పించుకుంది. కక్ష గట్టిన సామ్రాట్ యువతి చిత్రాలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. తన కోరిక తీర్చకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి, పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.