గత ఏడాది నుంచి ప్రజలు ఇబ్బందులు పడే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. కరోనా సోకిన రోగులకు రక్తం గడ్డ కట్టిన ఫోటోలు ఇవి. కరోనా సోకిన వారికి రక్తం గడ్డ కట్టడం వల్ల సమస్యలు ఉన్నాయని ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేసారు.
గడ్డకట్టడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా అవయవ నష్టం సంభవించడం జరుగుతుందని… 2% నుంచి 5% వరకు ఈ అవకాశాలు ఉన్నాయని చెప్తూ కరోనా రోగి నుంచి గడ్డ కట్టిన రక్తాన్ని బయటకు తీసామని ప్రాణాలు కాపాడామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అమెరికాలో ఈ సమస్య కారణంగా 30 మరియు 40 ఏళ్ళ యువకులు అకస్మాత్తుగా స్ట్రోకులు మరియు గుండెపోటులను ఎదుర్కొంటున్నారు.