బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరో కార్తిక్ ఆర్యన్. ‘లుకా చప్పీ’, ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.
ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్యా-2’ చిత్రంతో కార్తిక్ ఆర్యన్ ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం రూ.వంద కోట్ల క్లబ్ లోకి చేరడమే కాదు..రికార్డు వసూళ్లు ఇంకా చేస్తోంది. కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. సీనియర్ హీరోయిన్ తబు ఇందులో కీలక పాత్ర పోషించింది.
స్టార్ నటుడు కార్తిక్ ఆర్యన్ కు తాజాగా షాక్ తగిలింది. దాంతో ఆయన చేయాల్సిన ప్రదర్శనా కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. కార్తీక్ ఆర్యన్ కొవిడ్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలా ఐఫా అవార్డ్స్ -2022లో చేయాల్సిన ప్రదర్శన కార్యక్రమాలు రద్దయ్యాయి.